భారత్- చైనాకు ఆ విషయం పట్టదు: ట్రంప్

-

భారత్​, చైనా, రష్యా దేశాలు వాయు కాలుష్యం గురించి పట్టించుకోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోపించారు. అయితే అగ్రరాజ్యం మాత్రం ఈ విషయన్ని తీవ్రంగా పరిగణిస్తుందని ఉద్ఘాటించారు. ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి తాను అంగీకరించి ఉంటే అమెరికా పరిస్థితి దారుణంగా ఉండేదని ఇంధన రంగానికి సంబంధించి టెక్సాస్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

Trump
Trump

“వాయు నాణ్యతను పట్టించుకోవాలని వారందరూ మాకు చెబుతారు. కానీ నిజం చెప్పాలంటే.. భారత్​, రష్యా, చైనా వాయు కాలుష్యాన్ని పట్టించుకోవు. కానీ అమెరికా పట్టించుకుంటుంది. నా పాలనలో ఎలాంటి పొరపాట్లు జరగవు. అమెరికానే నా తొలి ప్రాధాన్యం అని ట్రంప్ అన్నారు.

డెమొక్రాట్లు ఆశిస్తున్నంతగా అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తే ఎందరో పౌరులు ఉద్యోగాలు కోల్పోయేవారని, దేశం నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోయేవని పేర్కొన్నారు ట్రంప్​. ఇలాంటి చర్యలు ఆశించడం ద్వారా డెమొక్రాట్లు దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో అమెరికా పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉండేవని.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సంబంధిత కార్మికులపై జరుగుతున్న దాడులను అడ్డుకున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్​.

Read more RELATED
Recommended to you

Latest news