వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు చుక్కెదురు అయింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ తిరస్కరించింది జిల్లా కోర్ట్. గత నెలలో మచిలీపట్నం మాజీమార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య సంచలనం సృష్టించింది.
ఇక నిందితులకు కొల్లు ఆదేశాలు ఇచ్చారు అని, ఆయనే ఈ వ్యవహారం మొత్తం ముందు ఉండి నడిపించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఆయన విశాఖ పారిపోతున్న సమయంలో కృష్ణా జిల్లా పోలీసుల సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో… ఏ.4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనతో పాటుగా చింతా చిన్నీ అనే వ్యక్తి కూడా జైలులోనే ఉన్నారు.