గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 94వ స్థానంలో నిలిచింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ మరియు పాకిస్తాన్ కూడా ‘తీవ్రమైన’ ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 లో భారతదేశం 107 దేశాలలో 94 వ స్థానంలో ఇండియా ఉంది. గత ఏడాది 117 దేశాలలో భారత ర్యాంకు 102 గా ఉంది. బంగ్లాదేశ్ 75 వ స్థానంలో ఉండగా, మయన్మార్, పాకిస్తాన్ 78, 88 వ స్థానంలో ఉన్నాయి.
73 వ స్థానంలో నేపాల్, 64 వ స్థానంలో ఉన్న శ్రీలంక ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్లతో సహా పదిహేడు దేశాలు ఐదు కంటే తక్కువ జిహెచ్‌ఐ స్కోర్‌లతో అగ్రస్థానాన్ని పంచుకున్నాయని తెలిపారు. ఆకలి మరియు పోషకాహారలోపాన్ని గుర్తించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ శుక్రవారం దీనిపై ప్రకటన చేసింది. నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు.