కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. మంగళవారం నాడు భారత దేశం లో 2.94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రెండు వేల మంది ఒక్క రోజులో మరణించడం జరిగింది.
కరోనా వ్యాపించినప్పటి నుంచి ఇన్ని మరణాలు రావడం ఇదే మొట్టమొదటిసారి. కరోనా వైరస్ మొదటి ఫేస్ లో సెప్టెంబర్ 17 న 98,795 కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి. అయితే అప్పటి కంటే కూడా కేసులు మంగళవారం ఎక్కువయ్యాయి.
ఒక్క మంగళవారం నాడు మాత్రమే 2,94,291 కేసులు నమోదయ్యాయి. అంటే మొట్టమొదటి సారి వచ్చిన కేసులు కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ. యుఎస్ లో జనవరి 8 న 3,07,570 కేసులు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు ఒకే రోజులో అక్కడ నమోదయ్యాయి.
ఏది ఏమైనా కరోనా కారణంగా మరణాలు ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. మంగళవారం నాడు 2,021 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 519, ఢిల్లీలో 277, చత్తీస్గఢ్లో 191, ఉత్తరప్రదేశ్ 162 కర్ణాటక 149 మరియు గుజరాత్ 121.
కేవలం ఏప్రిల్ నెలలో చూసుకుంటే 34 లక్షల కేసులు భారత దేశం లో నమోదయ్యాయి. అన్ని నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో ఎక్కువ రావడం జరిగింది. కేవలం మంగళవారం ఒక్కరోజులోనే కరోనా కేసులు తీవ్రంగా పెరిగాయి. మంగళవారం, కనీసం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా ఒకే రోజు పెరుగుదల నమోదైంది.
ఈ రాష్ట్రాల్లో 28,395 తాజా కేసులు, కర్ణాటక (21,794 కొత్త కేసులు), కేరళ (19,577), గుజరాత్ (12,206), రాజస్థాన్ (12,201), తమిళనాడు (10,986), బీహార్ (10,455), బెంగాల్ (9,819) , హర్యానా (7,811), తెలంగాణ (5,926), జార్ఖండ్ (4,969), ఒడిశా (4,761), ఉత్తరాఖండ్ (3,012), J&K (2,030), గోవా (1,160).