పాకిస్తాన్ కి ఇండియా నుండి కరోనా వ్యాక్సిన్..!

-

పాకిస్తాన్ కి భారత్ 4.5 కోట్ల కరోనా వ్యాక్సిన్ ని మార్చి నాటికి అందజేస్తోందని Federal Secretary National Health Services, Regulation and Coordination Aamir Ashraf Khawaja, PAC కి గురువారం నాడు చెప్పారు. ఈ సమాచారాన్ని ఇస్తూ నలభై ఐదు మిలియన్ల వ్యాక్సిన్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు తీసుకోనున్నారు. 16 మిలియన్ వ్యాక్సిన్ ని తప్పించి మిగిలినవన్నీ జూన్ నాటికి తీసుకుంటారు.

corona
corona

Gavi అనేది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిని ఇస్తోంది. వ్యాక్సిన్ ని అందిస్తామని సెప్టెంబర్ 2020 న పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని Khawaja అన్నారు. మార్చి మొదటి వారానికి ఇది వస్తుందేమో అని అనుకున్నారని తెలుస్తోంది. కానీ ఆలస్యం అయింది. మరి కొన్ని వారాల్లో వాక్సిన్ అందుతుందని అనుకుంటున్నారని అన్నారు ఖవాజా.

పాకిస్తాన్ కి ఇచ్చే వ్యాక్సిన్ Serum Institute of India (SII ) నుంచి వస్తుందని చెప్పింది ఇప్పటి వరకు భారత దేశం నుండి 15 దేశాలకు ఈ వ్యాక్సిన్ను అందించారు. మరికొన్ని 25 దేశాలకి త్వరలో పంపిస్తారని చెప్తున్నారు. గ్రాంటెడ్ బేస్ మీద చాలా దేశాలు వ్యాక్సిన్ ని తీసుకున్నారు. భారతదేశ ప్రభుత్వం చెప్పిన ధరలకే కొన్ని దేశాలు వాళ్ళు కొనుగోలు చేసారు.

పాకిస్థాన్ లో సోమవారం నాటికి 1592 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకు 5,92,100 వచ్చాయి. 22 మంది కరోనా తో చనిపోయారు. మార్చి 10 నుండి 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.

Drug regulatory authorities పాకిస్తాన్ చైనీస్ వ్యాక్సిన్ ని 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఉపయోగించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. Sinophram (China), Oxford-AstraZeneca (UK), Sputnik-V (Russia) and Cansino Bio (China) ఇలా నాలుగు వ్యాక్సిన్స్ ఆ దేశం లో రిజిస్టర్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news