ఆ ముగ్గురిని క‌లిశాకే హైదరాబాద్ కు సీఎం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ చేశారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్ ల‌ను క‌లిసిన త‌ర‌వాతే హైద‌రాబాద్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సమాచారం. ఇప్ప‌టికే ఈ ముగ్గురి అపాయింట్మెంట్ ల‌ను సీఎంఓ కోరినట్టు తెలుస్తొంది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అంతే కాకుండా సీఎం కేసీఆర్ మోడీని మ‌రియు మంత్రి షెకావ‌త్ ను శుక్ర‌వార‌మే క‌లిసే అవ‌కాశం ఉన్నట్టు స‌మాచారం. ఆ త‌ర‌వాత అమిత్ షా ను క‌ల‌వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై జారీ చేసిన గెజిట్ మ‌రియు ఇత‌ర‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై జల్‌శక్తి మంత్రి షెకావ‌త్ తో సీఎం చ‌ర్చించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ టూర్ కు ముందే సోమ‌వారం సీఎం త‌న నివాసంలో దీని విష‌య‌మై అధికారుల‌తో చ‌ర్చించారు.