ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈనెల 25న టీమిండియా ఇంగ్లాండ్తో తలబడనుంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. చాలా రోజుల తర్వాత ఉప్పల్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది.మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టిఎస్ఆర్టిసి తెలిపింది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఈ బస్సులు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి తిరిగి బయలుదేరనున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే అభిమానులు ఈ ప్రత్యేక బస్సుల సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని సజ్జనార్ కోరారు. తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు భారత ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం కానున్న సంగతి తెలిసిందే.