సొంతగడ్డ పై టీమిండియా ఇంగ్లాండ్ కు చుక్కలు చూపిస్తుందా

-

ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ విక్టరీతో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమిండీయా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. రేపటి నుంచి చెన్నైలో ప్రారంభంకానున్న తొలిటెస్టులో శుభారంభం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. విరాట్‌ కోహ్లి, ఇషాంత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య.. జట్టులోకి తిరిగి రావడంతో.. మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది భారతజట్టు. అయితే లంకను వాళ్ల సొంతగడ్డపైనే ఓడించిన ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

కంగారూలను వాళ్ల సొంతగడ్డపై ఓడించిన జోష్‌తో ఉంది టీమిండియా. స్పిన్‌ను సమర్ధంగా ఎదుర్కొని.. లంకను వాళ్ల దేశంలోనే ఓడించింది ఇంగ్లండ్‌. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. అయితే గత గణాంకాలు చూసుకుంటే.. టీమిండియాకు స్వదేశంలో తిరుగులేదు. పైగా బాగా కలిసివచ్చిన చెన్నైలో తొలి రెండు టెస్టులు జరుగుతున్నాయి. దీంతో ఈ సిరీస్‌లో కోహ్లీసేన హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.

రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, కోహ్లి, రహానేతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. భారత్‌లో కోహ్లి, రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. పంత్‌, అశ్విన్‌ కూడా బ్యాటింగ్‌లో రాణించగలరు. అయితే మరో స్పిన్నర్‌ కోసం కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ మధ్య పోటీ ఉంది. ఇక పేసర్లుగా.. బుమ్రా, ఇషాంత్‌, సిరాజ్‌లు ఉండే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యను ఎంపిక చేయాలనుకుంటే.. నలుగురు స్పెషలిస్టు బౌలర్లకే అవకాశం రావొచ్చు.

ఇక ఇంగ్లండ్‌ జట్టుకు సిరీస్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్‌ జాక్‌ క్రాలే.. గాయంతో తొలి రెండు టెస్టులకూ దూరమయ్యాడు. శ్రీలంకపై సిరీస్‌ విక్టరీ.. ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జో రూట్‌ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. స్టోక్స్‌, ఆర్చర్‌, బర్న్స్‌.. జట్టులో చేరడం.. ఆ టీమ్‌ను స్ట్రాంగ్‌గా మారుస్తోంది.

భారత్‌లో జరిగిన చివరి 35 టెస్ట్‌లలో టీమిండియా కేవలం ఒక్క మ్యాచే ఓడిపోయింది. 2016-17లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news