భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 68 స్కోరుతో నిలిచింది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఆరంభంలోనే పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూడో ఓవర్ నాలుగో బంతికి అతన్ని అవుట్ చేశాడు.
భువీ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ ఈ క్యాచ్ అందుకోవడంతో బాబర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగుల వద్ద బాబర్ ఆజమ్(10) షాట్‌కు ప్రయత్నించి అర్ష్‌దీప్ చేతికి చిక్కాడు.