ఆసియన్ గేమ్స్: సెమీస్ చేరిన భారత్ మహిళల క్రికెట్ జట్టు !

-

చైనాలోని గ్యాంగ్జౌ లో ఆసియన్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సంవత్సరం నుండి ఆసియన్ గేమ్స్ లో క్రికెట్ ను కూడా ఒక గేమ్ గా చేర్చబడింది. ఇక ఇండియా మహిళలు మరియు పురుషులు ఈ టోర్నీలో ఆడుతున్నారు. కాగా ఇండియా మహిళల జట్టు మాత్రము ఈ రోజు మలేషియా మహిళలతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా వర్షం కారణంగా కేవలం 15 ఓవర్లకు మాత్రము కుదించిన మ్యాచ్ లో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇందులో షెఫాలీ వర్మ 67 మరియు జెమీమా 47 మరియు రిచా ఘోష్ 21 పరుగులు చేసి ఇండియాకు మంచి స్కోర్ ను అందించారు. ఇక మలేసియా మహిళల జట్టు 174 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ స్టార్ట్ చేయగా కేవలం రెండు బంతులు మాత్రము పడ్డాయి. ఆ తర్వాత వర్షం పడడంతో మ్యాచ్ రద్దు చేశారు ఆసియన్ గేమ్స్ నిర్వాహకులు. దీనితో ఇండియా నేరుగా సెమీస్ కు అర్హత సాధించింది.

ఆసియన్ గేమ్స్ లో జరగనున్న మొదటి సెమీఫైనల్ లో ఇండియా 24వ తేదీన మ్యాచ్ ఆడనుంది. మరి మరి వీరికి ప్రత్యర్థిగా ఎవరు రానున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news