వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ ధావన్ సేన గ్రాండ్ విక్టరీ అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా డక్ వర్త్ లుఈస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేదించే నేపథ్యంలో వేస్టిండీస్ 26 ఓవర్లలోనే 137 మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది.
దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ నికోలస్ పురాన్ 42 పరుగులు, బ్రాండన్ కింగ్ 42 పరుగులు చేసి రాణించారు. మిగతా ఆటగాళ్లు అంతా చేతులెత్తయడంతో మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలోకి వెళ్ళింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. అటు టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే, ఓపెనర్ శుభమన్ గిల్ 98 పరుగులు చేసి టీమిండియా కు భారీ స్కోర్ ను అందించాడు.