శ్రీనగర్: భారత సైన్యం తన మిలిటరీ కాన్వాయ్ వాహనాలపై జెండా రంగును ఎరుపు నుండి నీలం రంగులోకి మార్చింది. కాశ్మీర్ లోయలో ప్రజలకు ఎక్కువగా స్నేహపూర్వకంగా కనిపించే ప్రయత్నాల్లో ఈ ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. కాశ్మీర్ లోయకు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలు అలానే పండుగ శుభాకాంక్షలు అంటూ ఉన్న బ్యానర్ లు కాన్వాయ్ లోని వాహనాల మీద ప్రదర్శనకు ఉంచారు.
వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, లెఫ్టినెంట్ కల్నల్ క్యూ ఖాన్ , “కాశ్మీర్ లోయలో మరియు వెలుపల వివిధ ప్రాంతాల నుంచి దళాలతో కదులుతున్న సైనిక వాహనాల పై జెండాలు ఎరుపు నుండి నీలం రంగులోకి మార్చబడ్డాయి, కంటోన్మెంట్ లోని గోడల మీద కూడా కాశ్మీర్ యువ సాధకుల ఫోటోలు ముద్రించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. “లాటీలను మోస్తున్నవాహనాలను ఆపమని కోరడానికి ఈలలు మాత్రమే ఉపయోగించమని కోరినట్లు సదరు అధికారి తెలిపారు.
Srinagar: Indian Army has changed the colour of flags on its military convoy vehicles to blue from red. The step is part of efforts to have a more people-friendly look in the Kashmir valley. Pictures of Kashmir valley and festival greetings have been put up on convoy buses. pic.twitter.com/ShuUqhv7cn
— ANI (@ANI) April 16, 2021