ఆ రెండు వేరియంట్ లకు కోవాక్సిన్ మొగుడు అంటున్న శాస్త్రవేత్తలు

-

ఇండియాలో బి .1.617 వేరియంట్… యునైటెడ్ కింగ్‌డమ్ లో బి .1.1.7 వేరియంట్ ల విషయంలో కోవాక్సిన్ చాలా బాగా పని చేస్తుందని భారత బయోటెక్ అధికారిక ప్రకటన చేసింది. కోవాక్సిన్… అభివృద్ధి చెందుతున్న వేరియంట్‌లకు వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ టైటర్లను (ఏకాగ్రత) ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ఈ విషయాలను ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

పీర్-రివ్యూడ్ మెడికల్ జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో దీన్ని ప్రచురించారు. ప్రస్తుతం భారతదేశంలో లభించే మూడు కోవిడ్ -19 వ్యాక్సిన్లలో కోవాక్సిన్ ఒకటి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 18 కోట్ల మందికి వాక్సిన్ ఇచ్చారు. కోవాక్సిన్ లో రోగ నిరోధక శక్తిని పెంచే సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news