ప‌బ్‌జి మొబైల్ గేమ్ స‌హా మ‌రో 280 యాప్‌ల‌పై త్వ‌ర‌లో నిషేధం..?

-

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం కార‌ణంగా భార‌త్ ఇప్ప‌టికే 59 చైనా యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అందులో టిక్‌టాక్ వంటి ప్ర‌ముఖ యాప్‌లు ఉన్నాయి. అయితే ఇవే కాదు.. మ‌రో 280 వ‌ర‌కు యాప్‌ల‌ను కేంద్ర ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ నిషేధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ యాప్‌లు చైనాకు చెందిన‌వి కాక‌పోయినా.. చైనాతో ప‌రోక్ష సంబంధాలు ఉన్నాయి. దీంతో వాటి వివ‌రాల‌ను ప్ర‌స్తుతం ఆ మంత్రిత్వ శాఖ ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది.

indian government may ban another 280 apps who might have links with china

చైనా స‌ర్వ‌ర్ల‌లో డేటాను నిక్షిప్తం చేస్తున్న స‌ద‌రు 280 యాప్‌ల వివ‌రాల‌ను ప్ర‌స్తుతం అధికారులు సేక‌రిస్తున్నారు. వాటిలో ప్ర‌ముఖ మొబైల్ గేమింగ్ యాప్ ప‌బ్‌జి మొబైల్ కూడా ఉంది. ఈ యాప్ నిజానికి ద‌క్షిణ కొరియాకు చెందిన‌ది. అయిన‌ప్ప‌టికీ దీన్ని మొబైల్ ప్లాట్‌ఫాంపై తెచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప‌బ్లిషింగ్ కంపెనీ స‌హాయం చేసింది. ఆ కంపెనీ కూడా ప‌బ్‌జి మొబైల్‌లో భాగంగా ఉంది. ఈ క్ర‌మంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు సంబంధించి చైనా స‌ర్వ‌ర్ల‌లో యూజ‌ర్ల డేటాను స్టోర్ చేసి ఉంటారేమోన‌ని ప్ర‌స్తుతం త‌నిఖీలు చేస్తున్నారు. అలాగే మొత్తం 280 ఇత‌ర యాప్‌ల డేటా వివ‌రాల‌ను కూడా సేక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా యాప్‌లు త‌మ యూజ‌ర్ల డేటాను చైనా స‌ర్వ‌ర్లలో గ‌న‌క స్టోర్ చేస్తుంటే వాటిపై నిషేధం విధించే అవ‌కాశాలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి.

కాగా ఆ 280 యాప్‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అధికారికంగా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ కేంద్ర ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ అధికారులు ఈ విష‌యంపై కావ‌ల్సిన అన్ని వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ని తెలిసింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే మ‌రిన్ని యాప్‌ల‌ను కేంద్రం నిషేధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news