కొత్త ప్రోగ్రామ్‌లో బిత్తిరి స‌త్తి.. సాక్షి టీవీలో గ‌రం గ‌రం వార్త‌లు..!

-

వీ6 న్యూస్ చాన‌ల్‌లో తీన్మార్ వార్త‌లైనా.. టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ అయినా.. మ‌రే ఇత‌ర న్యూస్ అయినా.. ప్రోగ్రామ్ అయినా.. బిత్తిరి స‌త్తి స్టైలే వేరు. ఏ చాన‌ల్‌లో ప‌నిచేసినా స‌త్తి ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందుతూనే ఉన్నాడు. త‌న‌దైన శైలిలో యాస‌తో.. హావ భావాల‌తో అల‌రిస్తూనే ఉన్నాడు. అందుక‌నే స‌త్తిని జ‌నాలు ఆద‌రిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవ‌లే సాక్షి టీవీలో చేరిన స‌త్తి మ‌రో కొత్త ప్రోగ్రామ్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు.

bithiri sathi to appear in sakshi tvs garam garam varthalu show

సాక్షి టీవీలో ఇక‌పై బిత్తిరి సత్తి ఓ కొత్త ప్రోగ్రామ్‌లో మ‌న‌కు క‌నిపించ‌నున్నాడు. గ‌రం గ‌రం వార్తల పేరిట ఆ చాన‌ల్ ప్రోగ్రామ్ నిర్వ‌హించ‌నుంది. నిత్యం రాత్రి 8.30 గంట‌ల‌కు ఆ కార్య‌క్ర‌మం ప్ర‌సార‌మ‌వుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8.30 గంట‌ల‌కు అదే కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ టెలికాస్ట్ చేస్తారు. గ‌రం గ‌రం వార్త‌ల ప్రోగ్రామ్‌కు సంబంధించి సాక్షి టీవీ ఓ ప్రోమోను కూడా ఇప్ప‌టికే విడుద‌ల చేసింది. అందులో స‌త్తి వార్త‌లు చ‌దువుతుండ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

అయితే మ‌రోవైపు బిగ్‌బాస్ షో సీజ‌న్ 4 ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో స‌త్తి అందులో పాల్గొంటాడా, లేదా.. అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక వేళ షోకు వెళ్లాల్సి వ‌స్తే.. సాక్షి టీవీ అందుకు అనుమ‌తి ఇస్తుంద‌నే స‌మాచారం అందుతోంది. దీనిపై త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news