ఇజ్రాయెల్ లో దారుణం… కరోనా,కరోనా అంటూ భారతీయుడిపై దాడి!

-

కరోనా భయం తో దేశాధినేతలను సైతం కలవరపెడుతోంది. కరోనా పేరు చెబితేనే అందరూ ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా మనుషుల మధ్య సామజిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. చైనా లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకడం తో అతలాకుతం అవుతున్నారు. ఇప్పటికే ఈ కరోనా ప్రభావం తో దాదాపు 6 వేల మంది మృతి చెందగా,లక్షలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రపంచ దేశాలు ఇంతగా కలవరపాటు గురయ్యేందుకు చైనానే కారణం అంటూ చైనీయులపై పలు దేశాల్లో జాత్యహంకార దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా భారతీయుల పై కూడా ఈ జాత్యహంకార దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన ఓ యూదుడిని టైబెరియాస్ నగరంలో కరోనా కరోనా అంటూ చితకబాదారు. మణిపూర్ లేదా మిజోరంలోని బ్నీ మెనాషే కమ్యూనిటికీ చెందిన అమ్ షాలెం సింగ్సన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి పోరియా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.

గత శనివారం చోటుచేసుకున్న ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది. సింగ్సన్ తన కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చాడు. అయితే ఈ దాడి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఎవ్వరూ లేకపోవడం తో ఇప్పుడు కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news