అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న అనేక నిర్ణయాలలో ముఖ్యమైనది హెచ్ 1 –బి వీసా పై ఆంక్షలు. ఈ విషయంలో ట్రంప్ తన పట్టు విడువలేదు. తమ అమెరికన్ల కి ప్రచారం సమయంలో స్థానిక ఉద్యోగాల కల్పన మీ తరువాతే విదేశీయులకి ఉంటుందని ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ట్రంప్ చర్యలు చేపట్టడం చెకచెకా జరిగిపోతున్నాయి.
కొంత కాలంగా హెచ్ 1 –బి వీసాల విషయంలో పెడుతూ వస్తున్నా ఆంక్షలు అందరికీ తెలిసినవే. ఈ మేరకు తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ భారతీయ ఐటీ కంపెనీలకి షాక్ ఇచ్చింది. గతంలో అంటే 2015 నుంచీ 2019 తో పోల్చుకుంటే హెచ్ 1 –బి ల కల్పన భారీగా తగ్గిందని ఓ నివేదికలో తెలిపింది. ఈ భారీ స్థాయిలో తిరస్కరణకి గురయిన వీసాలో అత్యధిక శాతం అంటే 70 శాతం భారతీయులవేనని తెలిపింది.
అందుకు గల కారణం ఏమిటంటే భారతీయ ఐటీ కంపీలపై ఇమ్మిగ్రేషన్ విధిస్తున్నఆంక్షలేనని ప్రకటించింది. భారతీయ కంపెనీకి చెందిన కాగ్నిజెంట్ కంపెనీ వీసాలు సుమారు 60 శాతం అత్యధికంగా తిరస్కరణకి లోనయ్యాయి. ఈ క్రమంలోనే స్థానిక ఐటీ కంపెనీలల వీసాల మంజూరు అధికంగా ఉందని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో స్థానిక అమెరికన్స్ మద్దతు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు నిపుణులు.