బ్రిటన్ లో భారత పరువు తీసిన భారతీయుడు..!!!

-

బ్రిటన్ లో ఆన్ లైన్ మోసానికి పాల్పడి ఇండియా పరువు తీశాడు ఒక భారతీయుడు. ఆన్ లైన్ కుంభకోణానికి పాల్పడిన కేసుకు సంబంధించి 44 ఏళ్ల సతీష్ కోటినాథుని కి బ్రిటిష్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పది మిలియన్ పౌండ్ల విలువ చేసే ఆన్ లైన్ కుంభకోణానికి పాల్పడిన నేరంలో సతీష్ తో పాటు మరో నలుగురికి కూడా బ్రిటిష్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది. సతీష్ కోటినాథుని బ్రిటన్ లోని ఈస్ట్ లండన్‌లో నివసిస్తున్నాడు.కుట్రపూరిత మోసం, అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం తదితర అభియోగాలపై ఆయనను గతేడాది జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా మాల్వేర్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఈ మెయిల్‌ లాగిన్‌లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ముఠా కు నాయకుడిగా 39 ఏళ్ల నైజీరియా జాతీయుడు ఒలుమయివా ఒగుండులే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇతనికి మోసపూరిత కుట్రపై ఆరు సంవత్సరాలు, క్రిమినల్ ఆస్తి మార్చడానికి కుట్ర చేసినందుకు ఏడున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు.

క్రిమినల్ ఆస్తులను మార్చినందుకు ఐదేళ్లు, కుట్రపూరిత మోసానికి మరో ఆరేళ్లు శిక్ష విధిస్తూ లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సమాచారం. మెట్స్ స్పెషలిస్ట్ క్రైమ్ డైరెక్టరేట్‌లో భాగమైన నార్త్ వెస్ట్ లండన్‌ ఎకనామిక్ క్రైమ్ యూనిట్‌ అధికారులు 2014 నుంచి 2019 వరకు 235 మోసాలను గుర్తించారు.వీటి విలువ 9,218,522.76 పౌండ్లు.బాధితులను యూకే నేషనల్ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ బ్యూరో సాయంతో గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version