వైరస్ పై పరోశోధనలు చేసి చివరికి ఆ వైరస్ కే బలైన భారత సంతతి శాస్త్రవేత్త

-

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. రాజు,పేద అన్న తేడాలేకుండా ఈ కరోనా ప్రతి ఒక్కరికి సోకి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు ఈ కరోనా సోకి కొందరు నటులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కరోనా కు భారత సంతతి కి చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త కూడా బలైనట్లు తెలుస్తుంది. భారత సంతతికి చెందిన మహిళా శాస్త్రవేత్త వైరస్ కణాలపై ఎన్నో పరిశోధనలు చేసి సత్కారాలు,ప్రశంసలు,అవార్డులు గెలుచుకున్న గీతా రామ్ జీ(50) కన్నుమూసినట్లు తెలుస్తుంది. అయితే తాను పరిశోధనలు చేసిన వైరస్ కారణంగానే ఆమె ప్రాణాలు వదలడం అందరిని కలిచివేసింది. దక్షిణాఫ్రికాలో పరిశోధనలు చేస్తూ ఉన్న ఆమె కరోనా వైరస్ సోకి మరణించినట్లు తెలుస్తుంది. వారం క్రితమే గీతా రామ్‌జీ లండన్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లగా, ఆ సమయంలో ఆమెకు కరోనా సోకినట్టు తేలడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న ఆమె ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఆమె మరణం పట్ల దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలితోపాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. HIV నిర్మూలనలో సరికొత్త పద్ధతులను కనిపెట్టిన ఆమె ఎన్నో రకాల పరిశోధనలు చేసి అవార్డులు, సత్కారాలు పొందారు. ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికాలోని క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగంలో ముఖ్య పరిశోధకురాలిగా సేవలు అందిస్తుండగా, ఈ మహమ్మారి సోకి ఆమె మరణించడం అందరిని కలచివేసింది.

క్లినికల్ ట్రయల్స్‌లో ఆమె చేసిన సేవలకు 2018లో ‘అసాధారణ మహిళా శాస్త్రవేత్త’ అవార్డును కూడా అందుకున్నారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారత సంతతికే చెందిన ఫార్మసిస్ట్‌ ప్రవీణ్‌ రామ్‌జీని వివాహం చేసుకున్న ఆమె ఇలాంటి ప్రాణాంతక వైరస్ తో మరణించారు. ఇప్పటికే కరోనా కారణంగా దక్షిణాఫ్రికా లో ఐదుగురు మరణించగా, మొత్తం 1350 కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news