టీడీపీ అధినేత చంద్రబాబువి పిల్ల చేష్టలు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కత్తికట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు కడుపుమంటతో మంచి వ్యవస్థను ఆరోపించారు. వృద్ధులు,దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ అందకుండా చేశారు. వాలంటీర్లు సీఎం జగన్ కి మేలు చేస్తారని ఆయన భయం.. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం అని మండిపడ్డారు సజ్జల.
వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే.. 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు.. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమి ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు.