నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. దీనిలో మొత్తం Indian Railway Jobs recruitment 1664 పోస్టులు వున్నాయి. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో డివిజన్లు, వర్క్ షాప్స్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఇవి అప్రెంటీస్ పోస్టులు.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే..
ఫిట్టర్, వెల్డర్, ఆర్మేచర్ వైండర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్,మెకానిక్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్, వైర్ మ్యాన్, ప్లంబర్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీ మీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటనెన్స్, క్రేన్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), స్టెనోగ్రాఫర్ (హిందీ).
దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్ట్ 2న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 1
ఇక విద్యార్హతలు చూస్తే.. 10వ తరగతి పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ కావాలి. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వయస్సు 2021 సెప్టెంబర్ 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఐటీఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcpryj.org/ వెబ్‌సైట్‌లో చూస్తారు.