మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ

-

హైదరాబాద్: కొత్తూరు సమీపం మేకగూడలో ఇంజినీర్డ్ స్టోన్, గ్రానైట్ ఉత్పత్తుల కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రోకర్ణ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ చంద్ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక పాలసీ అద్భుతంగా ఉందన్నారు. తక్కువ సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలోనే అతి పెద్ద మార్బుల్ పరిశ్రమను మేకగూడలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్లాంట్‌లో సూపర్ జంబో, జంబో స్లాబ్‌లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

 

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడాదికి 9 మిలియన్ చదరపు అడుగుల ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.500 కోట్ల పెట్టుబడితో కంపెనీ నిర్మాణం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news