మరొకరి ట్రైన్ టికెట్ పైన ప్రయాణం చెయ్యచ్చా..?

-

మరొకరి టికెట్ మీద రైలు ప్రయాణం చెయ్యచ్చా..? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇండియన్ రైల్వేస్ తాజాగా ఒక రూల్ ని తీసుకు వచ్చింది. మరి ఇక దాని కోసం పూర్తి వివరాలను చూస్తే.. తాజాగా ఓ నిబంధన తీసుకు రాగా.. కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చెయ్యచ్చని అంది.

రైల్వేశాఖ-ప్రయాణికులు

అలా ప్రయాణం చేయాలంటే వాళ్ళు మీకు రక్త సంబంధీకులై ఉండాలట. అంటే మీరు మీ తల్లి లేదా తండ్రి టికెట్ మీద కానీ బ్రదర్స్, సిస్టర్స్ టికెట్ మీద కానీ పిల్లలు లేదా భర్త, భార్య టికెట్ మీద కానీ ట్రావెల్ చెయ్యచ్చు. అయితే మొదట ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా ట్రావెల్ చేస్తున్న వ్యక్తి పేరు ఎంటర్ చెయ్యాలి.

ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా అవసరమైన డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చెయ్యాల్సి వుంది. అధికారులు చూసి అప్పుడు కన్ఫర్మ్ చేస్తారు. అదే విధంగా విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్నిఇస్తున్నారు. ఈ పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన డాక్యుమెంట్స్ తో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ దరఖాస్తు చేసుకుంటే అధికారులు చూసి అప్పుడు కన్ఫర్మ్ చేస్తారు.

అంతే కాక వెయిటింగ్ టిక్కెట్లు కన్ఫర్మ్ కాని ప్రయాణీకులకు ఓ స్కీమ్ ని తెచ్చారు. వికల్ప్ స్కీమ్ ని వాళ్లకు తీసుకు వచ్చారు. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు మరొక ప్రత్యామ్నాయ రైలులో సీట్ ని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news