దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో భారతీయ రైల్వే ఆగస్టులో ఓ ప్రత్యేక రైలును నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. అలాగే దేశంలోని 7 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు. కాగా ఈ యాత్రకు భారత్ దర్శన్ అని పేరు పెట్టారు. భారత్ దర్శన్ పేరిట ప్రత్యేక రైలును నడిపిస్తారు.
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, భీమశంకర్, త్రయంబకేశ్‌వర్, ఘృశ్నేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అలాగే యాత్రలో స్టాచూ ఆఫ్ యూనిటీ, పర్లి వైజ్‌నాథ్, ద్వారకాధీష్ ఆలయం, సబర్మతి ఆశ్రమంలను సందర్శించవచ్చు.
ఈ యాత్ర 13 రోజులు, 12 రాత్రులు ఉంటుంది. ఇందుకు రూ.12,285 చార్జిలు అవుతాయి. బ్రేక్‌ఫాస్ట్, ఫుడ్, ఇతర వసతులను కల్పిస్తారు. యాత్రలో పాల్గొనే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. ఈ యాత్రను లక్నోలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో బుక్ చేసుకోవచ్చు. లేదా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 8595924274, 8287930939 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇక ఈ రైలులో వారణాసి, గోరఖ్‌పూర్, దియోరియా సదర్, బెల్తారా రోడ్, మౌ, జాన్‌పూర్, సుల్తాన్‌పూర్, లక్నో, కాన్‌పూర్, ఝాన్సీలలో సీటింగ్ సౌకర్యం కల్పిస్తారు.