జల వివాదం : షర్మిల, కేసీఆర్‌లపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

జల వివాదంపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ కృత్రిమ పంచాయతీ పెడుతున్నాడని…. ఆ ట్రాప్ లో ఎవరూ పడొద్దని రేవంత్‌ పేర్కొన్నారు. జల వివాదం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులను .. షర్మిల వైపు నడిపించేందుకు కేసీఆర్ నడిపిస్తున్న డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. వైఎస్సార్, ఎన్టీఆర్ లు రాజకీయాలకు అతీతులు వారిని.. విమర్శించే వాడు నికృష్టుడేనని… దోపిడీ పై విచారణ అంటే ప్రధానమంత్రి మోదీని కలిసిన కేసీఆర్.. నీటీ విషయంలో ఎందుకు కలవరని ప్రశ్నించారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా.. కోర్టులో కేసులు ఎందుకు వేయవు ? అని నిలదీశారు.

రాజశేఖర్‌ రెడ్డి ని తిట్టడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా ? రోజా ఇంటికి పోయి.. బేషిన్లు లేవు భేషజాలు లేవని చెప్పింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. షర్మిల ఏదో మాట్లాడాలని.. అవగాహన లేకుండా మాట్లాడుతుందని మండిపడ్డారు. రెండున్నర కోట్ల ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాస్తుంటే.. సీఎం కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. జూలై 8 న రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయ పార్టీ పెడుతుందట.. అసలు ఆమె పార్టీ అవసరమా ? అని నిలదీశారు.

ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి అంటే ఒక శకం.. సంక్షేమం ద్వారా చేయాల్సింది చేశారని…తెలంగాణ సమాజానికి అభిమానం ఉందని తెలిపారు. తెలంగాణ కోడలు అని చెప్పిన షర్మిల.. ఈ నీళ్ల దోపిడీ కరెక్టా ? అని నీలదీశారు. కాంగ్రెస్ కు గతంలో అనుకూలంగా ఉన్న వ్యక్తులు, శక్తులు మళ్లీ తిరిగి వస్తుంటే.. కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని..ఈ రోజు నీళ్ల దోపిడీ లో రాజశేఖర రెడ్డి పాత్ర లేదు.. ఆయన కుమారుడు జగన్ హస్తం ఉందన్నారు. కాంగ్రెస్ అభిమానులను తప్పు దారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు రేవంత్‌.