వరల్డ్ కప్ కోసం ఫ్యాన్స్ సెలెక్ట్ చేసిన ఇండియా జట్టు … !

-

అక్టోబర్ లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని జట్లు తమ తమ స్క్వాడ్ లను ప్రకటించాయి. ఇండియా జట్టును కూడా బీసీసీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. కానీ ఈ జట్టులో కొందరి ప్లేయర్ ల ఎంపిక నచ్చని మాజీ క్రికెటర్లు, మరియు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియచేశారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ సెలెక్ట్ చేసిన వన్ డే వరల్డ్ కప్ ఇండియా జట్టును రిలీజ్ చేసింది. ఈ ఎంపికలో మొత్తం 7 లక్షల మంది ఓట్లు వేయగా .. 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎపడింది. ఈ జట్టును చూస్తే… రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, చాహల్, రాహుల్, జడేజా, అయ్యర్, సిరాజ్, షమీ, అశ్విన్, గిల్ మరియు ధావన్ లను సెలెక్ట్ చేశారు.

ఇక మొన్న సెలెక్ట్ అయిన సభ్యులలో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లు లేకపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news