ఇండియాలో సగం మంది 6 గంటలు కూడా పడుకోవట్లేదట

-

నిద్ర కూడా సర్వరోగ నివారణియే కొందరికి. కానీ కొందరు మాత్రం సరిగ్గా నిద్రపోరు. ఫలితంగా ఆ రోజంతా నీరసంగా.. బద్ధకంగా ఉంటారు. సాధారణంగా పెద్దలు రోజులో 6-7 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోని పరిస్థితి నెలకొంది. మార్చి 17 ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్‌ నెట్‌వర్‌ సంస్థ లోకల్‌ సరిల్స్‌ దేశవ్యాప్త సర్వేను నిర్వహించింది. ‘భారతదేశం ఎలా నిద్రపోతుంది?’ అంశంపై జాతీయ అధ్యయనాన్ని చేపట్టింది.

ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 39,000 కంటే ఎకువ మందిని ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. వారు నిద్రపోతున్న తీరు సమాచారం సేకరించింది. నిద్ర పోయే వేళలపై కరోనా ఏమైనా ప్రభావం చూపిందా? అన్న అంశాన్నీ అధ్యయనం చేసింది. ఆ వివరాలను ఇటీవలే వెల్లడించింది.

చాలా మంది భారతీయులు నిర్దేశించిన గంటలు నిద్రపోవడం లేదని ఈ సర్వేలో తేలింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆరు గంటల కంటే తక్కువ సమయం నిరాటంకంగా నిద్రపోతున్న వారి సంఖ్య 50 శాతం నుంచి 55 శాతానికి పెరగటం ఆందోళనకు గురిచేస్తోంది. 21 శాతం మంది 4 గంటల పాటే నిరాటంకంగా నిద్రపోతున్నారని ఈ సర్వే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news