భారతదేశంలో రెండు కూటములు మాత్రమే రాజకీయాలను శాసిస్తూ అధికారంలోకి మార్చి మార్చి వస్తున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ అధ్యక్షతన UPA అయితే, మరొక్కట్టి బీజేపీ కనుసన్నల్లో నడిచే ఎన్డీయే.. కాగా ప్రస్తుతం ఎన్డీయే అధికారంలో ఉంది. ఇక దేశ రాజకీయ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరును మార్చడానికి మంతనాలు జరుగుతున్నాయట. 2004 సంవత్సరంలో ఎన్నికల ఫలితాల సమయంలో ఏ పార్టీకి కూడా స్పతమైన మెజారిటీ రాకపోవడంతో.. అప్పుడు UPA అనేది ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కేవలం 181 సీట్ లకే పరిమితం అవడంతో, అప్పుడే ఏర్పడిన UPA మిత్రపక్షాలను కలుపుకుని తన బలం 218 కు చేరింది. దీనితో ఆ సంవత్సరం UPA అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత 2009 మరియు 2014 లలో UPA నే దేశాన్ని పాలించింది. ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం ఒక రాష్ట్రంలోనే అధికారాన్ని నిలబెట్టుకుంది.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాలలో UPA అధికారంలో ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న UPA పేరును మార్చాలని చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని జాతీయ మీడియా తెలుపుతోంది.