జనసేన కార్యకర్తపై శ్రీకాకుళం సిఐ అంజు యాదవ్ చేయించుకోవడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ సీఐ అంజూ యాదవ్ తీరుపై ఎస్పీని కలిసి ఆమెపై ఫిర్యాదు చేశారు. అంజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
అనంతరం తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్త సాయిపై దాడి చేసిన పోలీసు అధికారపై చర్య తీసుకోవాలని పవన్ వినతిపత్రం అందజేసారని.. ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పవన్ కి చెప్పామన్నారు. మా సమాధానంతో పవన్ సంతృప్తి చెందారని తెలిపారు.
సిఐ అంజూ యాదవ్ వ్యవహారంపై కమిటీ వేసి విచారణ జరుపుతామన్నారు. అంజు యాదవ్ కు సంబంధించి పాత ఘటనలు అన్నిటిని కూడా కమిటీ పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతుందన్నారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నించిన సందర్భంలో ఇది జరిగిందన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి కూడా తనకు నోటీసులు అందాయని.. సమాధానం ఇస్తామని తెలిపారు ఎస్పి.