ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి మిస్టరీగా మారిన మోనోలిత్(ఏకశిల) రాయి ఇప్పుడు మన దేశంలో కూడా ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద ఈ మోనోలిత్ వెలిసింది. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లు అలానే లోతుగా నేలలో పాతి పెట్టి నట్టుగా ఉంది. అహ్మదాబాద్‌లోని తల్తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్ వద్ద ఈ ఏకశి కనిపించింది.
పార్క్ లోపల ఎవరూ ఈ ఏకశిలను లోపలి తేవడం తాను చూడలేదని పార్క్ తోటమాలి ఆశా రాం పేర్కొన్నారు. తను సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు, మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పటికీ ఈ విచిత్ర నిర్మాణం అక్కడ వెలిసిందని ఆశా రాం తెలిపారు. ఈ మోనోలిత్ ముందుగా అమెరికాలోని ఉటా ఎడారిలో గుర్తించబడింది. ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి.