రేపు ఇండియా వార్మప్‌ మ్యాచ్‌..రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా శనివారం బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.అసలైన సంగ్రామంలో టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తమ సన్నద్ధతపై కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీతో సంభాషించాడు. వార్మప్‌ మ్యాచ్‌ కూడా తమకు చాలా ముఖ్యమని.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు దీన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఇక్కడి పిచ్‌, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. ఇంతకుముందెన్నడూ ఇక్కడ ఆడలేదు. అందుకే మాకు వార్మప్ మ్యాచ్‌ అత్యంత కీలకం అని హిట్ మ్యాన్ అన్నారు.బ్యాటర్లు, బౌలర్లు తమ లయను అందిపుచ్చుకోవడానికి సన్నాహకంగా ఈ వార్మప్‌లను వాడుకుంటాం. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాక.. న్యూయార్క్ అందాలను వీక్షించే అవకాశం వచ్చింది. వేదిక కూడా చాలా బాగుంది. ఓపెన్‌ గ్రౌండ్‌. ఇలాంటి మైదానంలో ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని తెలిపారు. తప్పకుండా భారీఎత్తున అభిమానులు క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేందుకు వస్తారని ఆశిస్తున్నా” అని రోహిత్ అన్నారు .

Read more RELATED
Recommended to you

Latest news