ఇండిగో విమాన సంస్థ ప్రజల జీవితాలతో చలగాటమాడేలా వ్యవహరిస్తుందని వైసీసీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఇండిగో విమానంలో రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లే క్రమంలో సాంకేతిక కారణాలో మరేఇతర కారణాల వల్లనో విమానం తిరుపతిలో ల్యాండ్ కాకుండాా బెంగళూర్ లో ల్యాండ్ అయింది. అయితే బెంగూళూర్ లో ల్యాండ్ అయినా డోర్లను తెరవకుండా ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింటి సదరు విమానయాన సంస్థ.
కాగా ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థపై నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతి కాకుండా బెంగళూర్ కు తీసుకెళ్లి.. డోర్లు తెరవకుండా మానసిక వేదనకు గురిచేశారని.. వాతావరణ కారణాలని మొదట చెప్పారు, ఆ తరువాత సాంకేతిక కారణాలని అంటున్నారని.. ప్రయాణికులు ఒక్కొక్కరు రూ. వేలు కట్టాలని అడిగారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై కోర్టును ఆశ్రయిస్తానని రోజా అన్నారు.