తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ వైతాళికుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సతీమణి ఇందిర మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరులో, హక్కుల ఉద్యమాల్లో జాదవ్ కు అన్ని రకాలుగా తోడుగా నడిచిన ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు.
2018లో జాదవ్ ను ఇప్పుడు వారి సతీమణి ఇందర ని కోల్పోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేసారు. జాదవ్- ఇందిరమ్మ ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదిక గా సీఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు.