ప్రపంచ స్థాయి వైద్యాన్ని తెలంగాణాకు తెస్తామంటూ పాలకులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా అవి అన్ని ప్రకటనలు గానే మిగిలి పోతున్నాయి. కనీసం ఎమర్జెన్సీ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తాండూర్ పట్టణం మల్ రెడ్డి పల్లికి చెందిన గర్భిణీ మనీషా పురిటి నొప్పులతో రెండో డెలివరీ కోసం ఉదయం 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
అక్కడున్న సిబ్బంది ఎవరు గర్భిణీ పట్టించుకోలేదు.. బాత్రూం గదిలోకి వెళ్లి గర్భిణీ శిశువును ప్రసవించింది… శిశువు అక్కడికక్కడే మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.. మొదట పాప జన్మించగా ఇప్పుడు బాబు పుట్టి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.