ధ‌ర త‌క్కువ.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు..!

-

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిలో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన పంచ్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. వీటిలో మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఇవి ప‌నిచేస్తాయి. హాట్ 9 ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయ‌గా.. హాట్ 9 ప్రొ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను అమ‌ర్చారు. ఇక రెండింటికీ వెనుక భాగంలో అద‌నంగా 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీ క‌లిగిన రెండు వేర్వేరు కెమెరాల‌ను అమర్చారు. ఈ ఫోన్ల‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇవి డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను క‌లిగి ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీల‌ను వీటిలో ఏర్పాటు చేశారు.

Infinix Hot 9 and Hot 9 Pro smart phones launched in India

ఇన్ఫినిక్స్ హాట్ 9, హాట్ 9 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.6 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌
* హాట్ 9 – 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* హాట్ 9 ప్రొ – 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డీటీఎస్ హెచ్‌డీ స‌రౌండ్ సౌండ్‌, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.8499 ఉండ‌గా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 8వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. హాట్ 9 ప్రొ ఫోన్ ధ‌ర రూ.9499 ఉండ‌గా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 5 నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news