టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ మొదలయ్యోది ఈ డేట్ నుంచేనా ..?

-

కరోనా కొట్టిన దెబ్బ ఎవరూ ఊహించనిది. ఈ దెబ్బకి కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలనే వణికించిన ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ని విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇన్ని రోజులు షూటింగ్స్ నిలిచిపోవడం మాత్రం గతంలో ఎన్నడు జరగలేదు.

 

ఈ పాటికే సినిమాల షూటింగ్స్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో కొత్త సినిమాల రిలీజ్ లతో కళ కళ లాడాల్సిన తెలుగు చిత్ర పరిశ్రమ బోసిపోయింది. అంతేకాదు గడిన ఈ రెండు నెలల్లో వందల కార్మీకులు గడ్డు కాలాన్ని అనుభవించారు. అందుకే సినిమానే నమ్ముకుని ఉన్న ఎందరో కార్మికులను ఆదుకోడానికి మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్స్ ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వమని కోరుతూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకులు తెలంగాణా సీఎం కెసిఆర్ ను కలిశారు.

ఈ కీలక చర్చల తర్వాత కొన్ని కరోనా నిబంధనలతో షూటింగులు జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పరు. అయితే ఏ తేదీ నుంచి మొదలు మొదలు పెట్టుకోవచ్చు అన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మన టాలీవుడ్ లో సినిమాలు జూన్ 15నుంచి మొదలు పెట్టుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తాజా సమాచారం. అయితే ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాతోనే మళ్ళీ షూటింగ్ మొదలయ్యో అవకాశాలున్నాయని విశవసనీయ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news