సచివాలయంలో నిన్న ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీ రైతులకు ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఈ నెల 24వ తేదీన ఏపీ రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సీడీ వేయాలని నిర్నయం తీసుకుంది జగన్ కేబీనేట్. అటు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు కెబినెట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయనుంది ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.