కియారా – సిద్ధార్థ్ ల ఉమ్మడి ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

-

ఫిబ్రవరి 7వ తేదీన బాలీవుడ్ ప్రేమ జంటల్లా విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులు విలువ కూడా డబుల్ అయినట్టు తెలుస్తోంది.. మరి ఇద్దరికీ కలిపి ఎంత ఆస్తి ఉంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సిద్ధార్థ మల్హోత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడమే ఇతడికి ప్లస్ పాయింట్.. అందుకే సినిమాలలో భారీ పాపులారిటీ లభించింది. ప్రస్తుతం ఒక్క యాడ్ కు 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. అదే సినిమాకు అయితే 8 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

దీనికి తోడు ఈయనకు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్ కూడా ఉంది. ఈ ఫ్లాట్ ను షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేసింది . దీనితో పాటు రూ.2.26 కోట్ల రూపాయల రేంజ్ రోవర్ కార్ , రెండు బెంజ్ కార్లు కూడా ఉన్నాయి. కియారా విషయానికి వస్తే బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల తీసుకుంటుంది. అంతేకాదు ఆమె యాడ్స్ కూడా చేస్తోంది. మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. ముంబైలో ఈమెకు 15 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ కూడా ఉంది.

ఇప్పుడు ఈ జంట వివాహం చేసుకుంది కాబట్టి మంత్లీ ఇన్కమ్ మూడు కోట్ల రూపాయలకు చేరింది. ఇద్దరి ఆస్తి కలిపి 125 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఒక మేనేజ్మెంట్ కంపెనీ అంచనా ప్రకారం వీళ్ళిద్దరి సంపాదన ఏడాదికి 21 శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news