కోనసీమ జిల్లా మామిడికుదురులో క్యాసినో వ్యవహారి చీకోటి ప్రవీణ్ వాహనాలను రాజోలు పోలీసులు తనిఖీ చేశారు. హవాలా సొమ్ము ఉందన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో కోడిపందేలకు స్నేహితులతో కలిసి వచ్చిన చికోటి ప్రవీణ్‌ను.. హవాలా సొమ్ము ఉందన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నాలుగు వాహనాల్లో వచ్చిన 20 మందిని ఇద్దరు ఎస్సైలు కృష్ణమాచారి, బాషాలు తనిఖీలు నిర్వహించారు. వాహనాలలో ఏమీ లభ్యం కాకపోవడంతో.. వివరాలు సేకరించి వదిలేశారని చీకోటి ప్రవీణ్ తెలిపారు.
“ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు.. రొటీన్ చెకప్ చేశారు. ఇబ్బంది ఏమీ లేదు.. ఏమైనా అడిగితే రోడ్డుపై వాహనాలను చెక్ చేస్తున్నామని చెప్పారు.. డబ్బులు ఏమైనా దొరకుతాయని అనుకున్నారు.. కానీ ఏమీ దొరకలేదు.. కేవలం సరదా పర్యటనకు వచ్చారు.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు జరపాలని నేను ఆంధ్రప్రదేశ్‌కు రాలేదు.” – చీకోటి ప్రవీణ్