మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ ఇన్ స్పెక్టర్..!

-

సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా, ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు ప్రజలకు అండగా ఉండాలి. పేదవారు, నిర్భాగ్యులు స్టేషన్ కు వస్తే వారిని ఆదరించాలి. కానీ ఓ పోలీస్ మాత్రం ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపట్ల కర్కశంగా వ్యవహరించాడు. మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ కేసులో ఓ ఇన్స్‌ పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ‌లోని అలీఘర్‌ లో చోటు చేసుకుంది.

rape
rape

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కంచే చేను మేసిందన్న చందంగా ఖాకీ నీచానికి దిగాడు. మహిళలను కాపాడాల్సిన పోలీసే సహోద్యోగినిపై అత్యాచారం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అలీగఢ్‌కి చెందిన రాకేష్ యాదవ్ క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌ గా పనిచేస్తున్నాడు. ఓ కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకుని తాను ఉంటున్న హోటల్ గదికి రావాలని మహిళా పోలీసుని ఆదేశించాడు. ఫైల్స్ తీసుకుని వెళ్లిన లేడీ పోలీస్‌పై ఇన్‌స్పెక్టర్ రాకేష్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారం చేశాడు.

అలీఘర్‌కు చెందిన రాకేశ్‌ యాదవ్ అనే క్రైంబ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఓ కేసు కు సంబందించిన ఫైల్ తీసుకొని తానున్న హోటల్ కు రమ్మని మహిళా కానిస్టేబుల్ ను ఆదేశించాడు. ఫైల్ తీసుకొని హోటల్ కు వెళ్లిన ఆమె పై అత్యాచారానికి పాలుపడ్డాడు ఆ ఇన్స్‌పెక్టర్‌. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దాంతో ఆమె విషయం బయట పెట్టకుండా ఉండిపోయింది. ఆమె భయాన్ని అలుసుగా తీసుకున్న రాకేశ్‌ యాదవ్ ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో ఓపిక నశించిన బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు యాదవ్ పై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. రాకేష్ యాదవ్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news