స్ఫూర్తి: టీ అమ్ముతూ కోటీశ్వరుడు అయ్యాడు.. చూస్తే శభాష్ అంటారు..!

-

కొంతమంది స్టోరీ ని చూస్తే చాలా ఆదర్శంగా ఉంటారు వాళ్ళని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మనం కూడా ఒక పెద్ద పొజిషన్ లోకి వెళ్ళచ్చు. ఐఐటి చదువుకున్న నితిన్ సలోజా అందరిలానే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం కూడా తక్కువ కాదు. లక్షల రూపాయల జీతం వచ్చేది. కానీ ఆ జాబ్ ని ఆ జీతాన్ని వదిలేసుకున్నారు. భారత్ కి మళ్ళీ తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. స్టార్ట్ అప్ ద్వారా కోట్లకి కోట్లు సంపాదిస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగం సంపాదించి మంచి జీవితాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు తిరిగి ముంబై వచ్చేసి కొత్త బ్రాండ్ టీ మీద దృష్టి పెట్టారు. నితిన్ సాలూజా కి స్నేహితుల సపోర్ట్ కూడా ఉంది ప్రస్తుతం 200 కంటే ఎక్కువ చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. లక్షల జీతం వదిలేసుకుని స్టార్ట్ అప్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. కేఫ్ కాఫీ డే కేఫ్ మోచా వంటివి అనేక కాఫీ షాప్స్ ఇండియాలో ఉన్నాయి.

కొత్త బ్రాండ్ ని వీళ్ళు అందుకే మొదలుపెట్టారు. ప్రముఖ టీ చైన్ కింద అయితే మారింది. వందల కోట్ల బిజినెస్ అవుతోంది. యూఎస్ లోని ఓ కంపెనీలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నప్పుడు నితిన్ దంపతులకు యూఎస్ లో టీ అమ్మే వాళ్ళు పెద్దగా కనిపించలేదు. టీ మీద ఉన్న ఆసక్తితోనే ఉద్యోగాన్ని వదిలేసుకుని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి 2020లో 100 కోట్ల ఆదాయం ని పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news