స్ఫూర్తి: 22 సంవత్సరాలకే ఐపీఎస్.. ఈమె సక్సెస్ ని చూస్తే.. చప్పట్లు కొడతారు..!

-

కొంత మంది తక్కువ వయసు లోనే సక్సెస్ ని అందుకుంటారు. అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఈ స్థాయి కి రావడానికి వాళ్ళు ఎంత గానో కష్టపడి ఉంటారు. కష్టపడితే లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా దేనినైనా సాధించడానికి అవుతుంది చాలా మంది చిన్నవయసు లోనే అనుకున్నది సాధించాలని భావిస్తారు. కానీ కష్టపడరు.

కష్టపడకపోతే అనుకున్నది ఎలా పూర్తి అవుతుంది..? కానీ ఈమె మాత్రం బీటెక్ చదివి తర్వాత అనుకున్నట్లే ఐపీఎస్ పూర్తి చేశారు. ఈమె పేరు అన్షికా వర్మ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ కి చెందిన ఆమె. ఐపీఎస్ ఎగ్జామినే క్లియర్ చేయడానికి ఈమె ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. రెండో ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

2019లో సివిల్స్ పరీక్ష కోసం మొదటిసారి ఈమె ప్రయత్నించారు కానీ అప్పుడు ఈమె సాధించలేకపోయారు. ఒక పక్క బీటెక్ చదువుతూ ఇంకో పక్క పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు రెండవసారి పరీక్ష రాసినప్పుడు 136వ ర్యాంకు వచ్చింది. 22 సంవత్సరాల వయసులోనే ఐపీఎస్ గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఐపీఎస్ శిక్షణ తర్వాత యూపీ కేడర్ లోనే ఈమె పని చేస్తోంది. ఈమెలానే ముందడుగు వేస్తె ఎవరైనా సరే సక్సెస్ కావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news