స్ఫూర్తి: ఇది కదా సక్సెస్ అంటే.. రూ.84.5 లక్షల ప్యాకేజీతో జాబ్..!

-

చాలామంది జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ మధ్యలోనే కొన్ని సమస్యల వల్ల… అడ్డంకులు వల్ల సక్సెస్ అవ్వలేకపోతారు. అనుకున్నది సాధించలేక పోతారు. అటువంటి వాళ్ళు ఈమెని స్ఫూర్తిగా తీసుకుంటే కచ్చితంగా లైఫ్ లో పైకి రాగలుగుతారు. అనుకున్నది సాధించగలరు. భారీ ప్యాకేజీ తో జాబ్ ని సాధించి తండ్రి కలలను నెరవేర్చింది ఈ అమ్మాయి. ఈమె పేరు రేపాక ఈశ్వరి ప్రియా. ఏయూ చరిత్ర లోనే పెద్ద ప్యాకేజీ తీసుకున్న విద్యార్థి ఈమె.

ఈమె సక్సెస్ స్టోరీ చూసేద్దాం మరి.. ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ ని సాధించింది. ప్రియా తన తండ్రి అనుకున్నట్టే విజయం సాధించింది. నేను ఎలాగో చదవలేకపోయాను బాగా చదువుకో అని చెప్తూ ఉండేవారు ఆమె తండ్రి. ఆ మాటలని ఆమె సీరియస్ గా తీసుకొని జీవితం లో పైకి వచ్చింది ప్రియ.

మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడే తన తండ్రి ఆనందంగా ఉంటారని తన తండ్రి ఆనందం కోసం ఎంతగానో కష్టపడి చదువుకుని ఇప్పుడు మనందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో ఈమె చేరింది. తన సోదరుడు కూడా ఈమెకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈమె మోర్గాన్ స్టాండ్లీ సంస్థ లో ఇంటర్షిప్ కోసం అప్లై చేసింది.

రెండు నెలల ఇంటర్న్ షిప్ లో 87 వేల రూపాయల స్టైఫండ్ ఈమెకి వచ్చింది 28 లక్షల ప్యాకేజీ తో ఆమెకి ఆఫర్ ఇచ్చింది కంపెనీ. అమెజాన్ కోడింగ్ పరీక్షలోనూ సెలెక్ట్ అయింది నెలకి లక్షన్నర అందించడం మొదలుపెట్టింది. అలానే అట్లాషియన్లో భారీ ప్యాకేజీతో ఈమె ఉద్యోగాన్ని పొందింది ఏకంగా ఏడాదికి 84 లక్షల ప్యాకేజీని అట్లాషియన్ కంపెనీ ఈమెకి ఆఫర్ చేసింది. అది కూడా వర్క్ ఫ్రం హోమ్ ఏ. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది సాధించడానికి కృషి చేయాలి అప్పుడు కచ్చితంగా జీవితంలో పైకి రాగలరు.

Read more RELATED
Recommended to you

Latest news