ఉద్దేశపూర్వకంగానే హిందూ సమాజంపై కుట్రలకు పాల్పడుతున్నారు – కరాటే కళ్యాణి

-

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తాజాగా రూపొందించిన ఓ ఆల్బమ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ సాంగ్ పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కరాటే కళ్యాణి ఈ విషయంపై మరోసారి మాట్లాడుతూ.. దేవి సినిమా తో.. కెరీర్ లో గుర్తింపు తెచ్చుకున్న dsp ఇలాంటి పని చేస్తాడా? అని మండిపడ్డారు.

dsp కూడా హిందువే కదా.. సభ్యత, సంస్కారం ఉండాలని విమర్శించారు. విదేశీ అమ్మాయిలతో.. బికినీలు వేయించి “రామరామ కృష్ణకృష్ణ” అని పాడిస్తూ విచిత్రమైన డ్యాన్సులు వేయించడం సిగ్గుచేటన్నారు కరాటే కళ్యాణి. హిందూ సమాజాన్ని కించపరిచేలా ఈ పాట ఉండని.. తక్షణం ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ccs తోపాటు మరికొన్ని పోలీస్ స్టేషన్ల లో కేసులు పెట్టామని.. పదాలు తొలగించకపోతే.. dsp ని ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ పాట రాసింది ఒక ముస్లీమ్.. మరి పాటలో అల్లా అనే పదం కూడా పెట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే.. హిందూ సమాజం పై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కరాటే కళ్యాణి.

Read more RELATED
Recommended to you

Latest news