ఈ మధ్యకాలంలో సిగరెట్లను తాగడం యువత ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. ఆరోగ్యం మాట పక్కన పెట్టి స్టయిల్ గురించి ఆలోచిస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.. అయిన కూడా సిగరెట్లను మానడం లేదు.. యువత ఈ-సిగరెట్‌ను మత్తుగా వాడుతున్నారు. దీని వ్యసనం కూడా ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ- సిగరెట్ అలవాటు యూత్‌లో క్రేజ్‌గా పుంజుకుంటుంది.. అన్నది మాత్రం నిజంగా ఆందోళన కలిగించే విషయంగానే చెప్పాలి.
ఇ-సిగరెట్లు పూర్తిగా సురక్షితమైనవి కావు. ఈ-సిగరెట్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఇది గుండెకు తీవ్రమైన హానిని కలిగిస్తుంది. ప్రతిరోజూ ఇ-సిగరెట్ తాగేవారి గుండె, రక్తనాళాల పనితీరు క్షీణిస్తుంది. అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ సిగరెట్ వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చుద్దాము..
మామూలు సిగరెట్లలో పొగాకు,నికోటిన్ రెండు వుంటాయి..కానీ, వీటిలో మాత్రం నికోటిన్ ఒకటే ఉంటుందట..నికోటిన్ బాధితుల్ని దానికి బానిసగా మార్చేసుకుంటుంది. సాధారణ సిగరెట్ల కంటే ఇ-సిగరెట్లు తక్కువ హానికరం. ఈ-సిగరెట్ పొగ ఇతర ధూమపాన వస్తువుల మాదిరిగానే ప్రమాదకరమైనది.కేవలం 15 నిమిషాల్లో వ్యక్తుల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీని కారణంగా శరీరం ‘ఫైట్ అండ్ ఫ్లైట్’ మోడ్ ఆన్ చేయబడుతుంది.అందుకు కారణంగా వారి రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది.
అటువంటి పరిస్థితిలో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం. దీని వల్ల ధమని గోడలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇ-సిగరెట్ లేదా సాధారణ సిగరెట్ తాగిన వెంటనే రక్తపోటు, హృదయ స్పందన రేటు, రక్తనాళాల టోన్‌లో మార్పులు సంభవిస్తాయి. ఈ సిగరెట్లు తాగడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా వుంటుందని నిపుణులు అంటున్నారు.ఇవి తప్పక గుర్తు పెట్టుకొని మరీ తాగడం మేలు..