ఒక‌ట్రెండు రోజుల్లో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్ష‌ల షెడ్యూల్..?

తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప‌దోత‌ర‌గ‌తితో పాటు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్స్ ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ప‌దోత‌ర‌గతి విద్యార్థుల‌ను ఇంట‌ర్ కు ప్ర‌మోట్ చేశారు. ఈ యేడాది కూడా క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఆ విద్యార్థును సెకండ్ ఇయ‌ర్ కు ప్ర‌మోట్ చేశారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఒక‌ట్రెండు రోజుల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుని షెడ్యూల్ ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయర్ సెకండ్ ఇయ‌ర్ లో ఉన్న విద్యార్థులు మ‌ళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్ పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతున్నారు. ఎంసెట్, నీట్ ప‌రీక్ష‌ల‌లో వెయిటేజీ ఉన్న నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఫ‌స్ట్ ఇయిర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యం తీసుకుంది.