సమంత ట్వీట్ కు నాగ చైతన్య రిప్లే : విడాకులపై క్లారిటీ !

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే విడాకులపై ఇంత రచ్చ జరుగుతున్నా చైతూ గానీ, సమంత గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరో వైపు వారి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే… నిన్న హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ విడుదలైంది.

Naga-Chaitanya-Samantha

అయితే ఈ ట్రైలర్ పై… ఎప్పుడూ లేని విధంగా అక్కినేని సమంత…ట్విట్టర్ వేదికగా స్పందించింది. తన భర్త అయిన హీరో నాగచైతన్య ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. లవ్ స్టోరీ సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు సమంత. అంతేకాదు ఈ ట్వీట్ లో హీరోయిన్ సాయి పల్లవి ని మాత్రమే టార్గెట్ చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు సమంత. ఇది ఇలా ఉండగా.. తాజాగా నాగ చైతన్య.. సమంత చేసిన ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చాడు. లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ పై పాజిటివ్ గా స్పందించినందుకు “స్పెషల్ థాంక్స్ సామ్” అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అంతే కాదు నాగ చైతన్య చేసిన ట్వీట్ తో.. విడాకుల వివాదానికి ఫుల్ పడినట్లయింది.