వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు వీటిని మరిచిపోవద్దు..!

-

కరోనా వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work From Home ) చేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి నడుము నొప్పి, మెడ నొప్పి వంటివి ఎక్కువగా ఉంటున్నాయని.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల కంఫర్ట్ గా లేదని అంటున్నారు. అలానే డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

వర్క్ ఫ్రమ్ హోమ్ | Work From Hom
వర్క్ ఫ్రమ్ హోమ్ | Work From Hom

మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవడం:

వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఇలా గ్యాప్ ఇచ్చి వర్క్ చేయడం వల్ల ఒత్తిడి, నీరసం వంటి ఇబ్బందులు ఉండవు. అదే విధంగా డిస్క్ పైన ఒత్తిడి కూడా తగ్గుతుంది.

నిదానంగా కూర్చోవడం:

వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు నడుము పైన ఒత్తిడి పడకుండా నిదానంగా కూర్చోవాలి. అదే విధంగా మీరు కూర్చునే కుర్చీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్లు చూసుకోండి.

ఒకే పొజిషన్ లో కూర్చోవద్దు:

మీరు వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు ఒకే పొజిషన్లో కూర్చోకండి. కొంత సమయం తర్వాత పొజిషన్ మార్చుతూ ఉండండి. అలానే సరిగ్గా మీరు మోనిటర్ ని ఎడ్జస్ట్ చేసుకోండి. అలానే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే నడుము నొప్పి, మెడ నొప్పి ఉండవు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news