బిగ్‌ బ్రేకింగ్‌: ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా

-

బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్‌ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా రేపు అసాని తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో ఏపీలోని పలు జిల్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. రేపు ఏపీలో నిర్వహించాల్సిన ఇంటర్‌ పరీక్షను వాయిదా వేయిస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ వెల్లడించింది.

Telangana Inter exams 2022 likely from last week of April

అయితే రేపు వాయిదా వేసిన పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6న ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9లక్షల 14వేల 423 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news