జులై 11 నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై ఒకటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావాలని ఆదేశాలు జారీ చేశారు. పదవ తరగతి పలితాలు ఆలస్యం కావడం తో మొదట సంవత్సరం తరగతులు ఆలస్యం అయిన విషయం వాస్తవమేనని.. కానీ.. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు మాత్రం ప్రారంభించాలని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా… కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదేపై చేయి అయింది. జేఈఈ పరీక్షల కారణంగా కూడా పరీక్షలు ఆలస్యం అయ్యాయని.. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలు బాగా పగఢ్భందిగా నిర్వహించామని.. ఆగస్ట్ 1 నుండి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు సబితా ఇంద్రారెడ్డి. కరోనా తరవాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు.